ఖర్మ నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నీ చాక్లెట్ నీకిచ్చేస్తుంది
on Jan 7, 2024
.webp)
"పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం..కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్నీ మర్చిపోదు...కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది...వడ్డీతో సహా" అంటూ బ్లడీ మేరీ అనే మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటూ బిగ్ బాస్ కండల బాయ్ అఖిల్ సార్థక్ కూడా అదే మాట చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక డైలాగ్ పెట్టుకున్నాడు. మరి అఖిల్ కి ఎం జరిగిందో ఎవరి వలన హార్ట్ అయ్యాడో తెలీదు కానీ ఈ డైలాగ్ ని మాత్రం ఎవరికోసమే రిలేట్ అయ్యలానే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. "నిజం చెప్తున్నా..ఖర్మ చాలా చాలా పవర్ ఫుల్.
నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నీ టాఫీ, నీ చాక్లెట్ నీకిచ్చేస్తుంది..కాబట్టి అందరితో మంచిగా ఉండు, మంచి పనులు చెయ్యి. ఎవరినీ మోసం చేయాలని మాత్రం అస్సలు చూడకు. ఎందుకంటే ఖర్మ అనేది నీకంటే ఎక్కువగా, నీకంటే చాలా అందంగా నిన్ను కూడా మోసం చేస్తుంది" అంటూ అద్దిరిపోయే ఒక కోట్ ని పోస్ట్ చేసుకున్నాడు. మరి ఇంతకు ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టాడో వాళ్ళు చూసారో లేదో తెలీదు కానీ ఫాన్స్ మాత్రం సూపర్ అంటున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ ఆట గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు..ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో అఖిల్ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా నిలబడేసరికి అతన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఎట్టకేలకు ఇన్డైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ ని గెలిపించడంలో తన పాత్రను పోషించాడు అఖిల్. దమ్ముంటే ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆడి చూడండి అంటూ ట్రోల్లర్స్ కి కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు అఖిల్. అఖిల్ ‘బావా మరదలు’ అనే చిత్రంలో నటించాడు. అలాగే ‘ముత్యాల ముగ్గు’ ‘ఎవరే నువ్వు’ ‘కళ్యాణి’ ‘మోహిని’ వంటి సీరియల్స్ లో కూడా నటించాడు. అఖిల్ కి కండలు పెంచడం, వేర్వేరు ప్రాంతాలకు దైవ దర్శనాలకు వెళ్లడం అంటే చాల ఇష్టం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



